ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
ఎంత కృపామయుడవు
Lyrics
ఎంత కృపామయుడవు
ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)
నలిగితివి వేసారితివి (2)
నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత||
బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం (2)
మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత||
కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ (2)
మరువలేదు నన్ను విడువలేదు (2)
ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత||
కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ (2)
వీడను ఎన్నడు నీ సన్నిధి (2)
నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||
Comments
Post a Comment