తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది Lyrics - JOHN WESLEY

Lyrics
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది || 2 ||
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని || 2 ||
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది
1. మందను విడిచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతిగానాలు పాడాములే || 2 ||
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది
2. బంగారమును సాంబ్రాణియు
బోలంబును తెచ్చాములే
ఇంటిలో మా ఆ కంటితో
నిన్ను కనులారా దాల్చాములే || 2 ||
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిన్ను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిన్ను ఘనపరచి పొగిడాములే
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది || 2 ||
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని || 2 ||
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది
Comments
Post a Comment